Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ISRO To Help Implement Satellite TV Classrooms for Students in India

 

ISRO To Help Implement Satellite TV Classrooms for Students in India

శాటిలైట్ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించడానికి ఇస్రో సహకారం

* విద్యార్థులకు శాటిలైట్ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించడానికి రంగం సిద్ధమైంది.

* దేశీయ ఉపగ్రహాలన్నీ ఇస్రో ఆధీనంలో ఉన్నాయి.

* ఆయా సేవలను వినియోగించుకోవడానికి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది.

* దీనికి సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదనలకు ఇస్రో అంగీకారం తెలిపింది.

* రాష్ట్రాలకు శాటిలైట్ హక్కులను బదలాయించడానికి కూడా ఇస్రో తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.

* దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో శాటిలైట్ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమవంతు సహకారం అందిస్తామని ఇస్రో ప్రకటించింది.

* వాటిని ఎలా వినియోగించాలనే అంశంపై సాంకేతిక సహకారాన్ని సైతం అందించడానికి సిద్ధమని స్పష్టంచేసింది.

* కరోనా కారణంగా విద్యాబోధనలో వచ్చిన ఖాళీని భర్తీ చేయడంలో సహకారం అందిస్తామని తెలిపింది.

* శాటిలైట్ టీవీల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలనే విషయంపై కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఇస్రో శాస్త్రవేత్తలు, దూరదర్శన్ అధికారులు హాజరయ్యారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags