JEE Advanced 2021 Exam Date Announced
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021: జేఈఈ
అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ఖరారు
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు తేదీ ఖరారైంది. అక్టోబర్ 3న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. జులై 3న జరగాల్సి ఉన్నప్పటికీ కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అక్టోబర్ 3న జరుగుతుందని మంత్రి ట్విటర్‌లో వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఖరగ్‌పూర్ ఐఐటీ నిర్వహించనుంది.
మరోవైపు, జేఈఈ
మెయిన్ చివరి విడత పరీక్షల తేదీలు ఇటీవల మారిన విషయం తెలిసిందే. ఆగస్టు 26,
27, 31, సెప్టెంబర్ 1,2
తేదీల్లో చివరి విడత పరీక్షలు జరుగుతాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల
వెల్లడించారు.
JEE (Advanced) 2021 examination for admission in #IITs will be held on the 3rd October, 2021. The examination will be conducted adhering to all Covid-protocols.@DG_NTA @PIBHRD @EduMinOfIndia @IITKgp @PMOIndia
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 26, 2021
0 Komentar