JEE Main 2021 Answer Key for Session 3
Out, Direct Link Here
జేఈఈ మెయిన్-2021 ఏప్రిల్ సెషన్ ప్రాధమిక
‘కీ’ విడుదల
జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్ష
ప్రాథమిక 'కీని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టిఏ) జులై 29న విడుదల
చేసింది. ఈ ప్రాథమిక 'కీ' ప్రకారం
విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యారులు 300కు 300
మార్కులు సాధించారు. ప్రాథమిక 'కీలో మార్పులు లేకపోతే
జాతీయస్థాయిలో వీరు టాపర్లుగా నిలిచే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు
చెందిన వెంకట పనీష్, గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన
కరణం లోకేష్ లకు ఈ 'కీ ప్రకారం 300 మార్కులు వస్తాయని కళాశాల
ప్రకటించింది.
ఇదే కళాశాలకు చెందిన ఒంగోలు వాసి
రాహుల్ దీప్ కు 295 మార్కులు వస్తాయంటున్నారు. ఈ నెల 20, 22,
25, 27 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షను
నిర్వహించారు. ప్రాథమిక 'కీపై 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకూ
అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ఎన్డీఏ వెల్లడించింది. అనంతరం సబ్జెక్టు నిపుణుల
ప్యానల్ పరిశీలిస్తుంది. అనంతరం తుది 'కీ’ ని ఎన్‌టిఏ విడుదల చేస్తుంది.
0 Komentar