JEE Main 2021: Dates Announced for
Pending Sessions, Application Window to Reopen
జేఈఈ (మెయిన్స్) మూడో విడత, నాలుగో
విడత పరీక్షల తేదీల ప్రకటన
మూడో విడత – జూలై 20 నుంచి 25 వరకు
నాలుగో విడత – జూలై 27 నుంచి ఆగష్టు
2 వరకు
కరోనా రెండో దశ విజృంభన నేపథ్యంలో
రద్దయిన జేఈఈ (మెయిన్స్) ఏప్రిల్, మే సెషన్లను జులై, ఆగస్టు నెలల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్
పోఖియాల్ ప్రకటించారు.
మూడో విడత పరీక్షను జులై 20 నుంచి
25 వరకు,
నాలుగో విడత పరీక్షను జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు జరపనున్నట్లు
తెలిపారు. కరోనా కారణంగా దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు
మంత్రి పేర్కొన్నారు. జులై 6 రాత్రి నుంచి 8వ తేదీ వరకు ఎన్‌టిఏ దరఖాస్తులను స్వీకరిస్తుందని వివరించారు.
ఈ ఏడాది జేఈఈ పరీక్షలను నాలుగు విడతలుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి రెండు విడతల పరీక్షలు ఇప్పటికే ముగియగా.. షెడ్యూల ప్రకారం ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన మరో రెండు విడతల పరీక్షలు వాయిదా వేయక తప్పలేదు. ఆయా పరీక్షల కొత్త తేదీలను పరిస్థితులు చక్కబడ్డాక నిర్వహిస్తామని గతంలోనే ఎన్టీఏ పేర్కొంది. దీంతో తాజాగా సమీక్షించిన మంత్రి రమేశ్ పోఖియాల్ జులై, ఆగస్టులో పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు.
There were some concerns among the students regarding #JEE(Main)-2021 Examination during Covid. Hon’ble PM Shri @narendramodi Ji has always said that the safety, security and bright future of our students should be the highest priorities of the Education Ministry. pic.twitter.com/saSNSw2o6J
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 6, 2021
0 Komentar