JEE Main 2021 Session 4 Postponed, New
Dates Here
జేఈఈ (మెయిన్)-2021: పరీక్షల షెడ్యూల్‌లో మళ్లీ మార్పు - నాలుగో సెషన్
దరఖాస్తుల గడువు పెంపు
జేఈఈ (మెయిన్) నాలుగో విడత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ పరీక్షలను ఆగస్టు 26, 27, 31; సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జేఈఈ మెయిన్ నాలుగో సెషన్ దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ పరీక్షకు ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని, విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. మూడు, నాలుగు విడతల జేఈఈ మెయిన్ పరీక్షల మధ్య నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డీజీకి సూచించినట్టు మంత్రి తెలిపారు.
గత ఏప్రిల్‌లో జరగాల్సిన జేఈఈ
(మెయిన్) మూడో విడత పరీక్షల్లో ఎన్‌టీఏ స్వల్ప మార్పులు చేసినట్టు నిన్న
ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు మూడో విడత పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అయితే,
మే నెలలో జరగాల్సిన నాలుగో దశ పరీక్షలను ఆగస్టు నెలాఖరు నుంచి
నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది.
JEE
Main 3rd Session Admit Card Released - Exam Dates Revised
0 Komentar