Reliance Jio Launches Emergency Data
Loan Packs of 1GB: Details Here
జియో: ప్రీపెయిడ్
వినియోగదారులకు కొత్తగా ఎమర్జెన్సీ డేటా లోన్ ఫీచర్
రిలయన్స్ జియో శనివారం సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. వినియోగదారులు పని మధ్యలో ఏ మాత్రం అసౌకర్యానికి గురికాకుండా, డేటా కొరత రాకుండా చూసేందుకు ఎమర్జెన్సీ డేటా లోన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. జియో ప్రీపెయిడ్ వినియోగదారులందరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ శనివారం వెల్లడించింది.
ఎమర్జెన్సీ డేటా లోన్ ఫీచర్ కింద.. వినియోగదారులు ముందుగా డేటా లోన్ తీసుకుని తర్వాత చెల్లించొచ్చు. ప్రతి ఒక్కరూ ఐదు డేటా రీఛార్జ్ ప్యాక్‌ల వరకు లోన్ పొందొచ్చు. ఒక్కో ప్యాక్‌తో 1జీబీ డేటా లభిస్తుంది. అందుకు రూ.11 చెల్లించాల్సి ఉంటుంది. లోన్ వాడుకోవాలంటే అప్పటికే వ్యవధి ముగియని ప్లాన్ ఉండాలి. ఆ బేస్‌ప్లాన్ చెల్లుబాటు అయ్యేవరకు లోన్ తీసుకున్న డేటాను వినియోగించుకోవచ్చు.
డేటా లోన్ సదుపాయాన్ని
వినియోగించుకోవాలనుకుంటే.. మై జియో యాప్‌లోని మెనూ బటన్‌లో ‘ఎమర్జెన్సీ డేటా లోన్’ను
ఎంచుకోవాలి. ‘ప్రొసీడ్’ను క్లిక్ చేయగానే.. ఐదు 1జీబీ ఎమర్జెన్సీ
డేటా ప్యాక్స్ కనిపిస్తాయి. ఇక్కడ ‘గెట్ ఎమర్జెన్సీ డేటా’ను క్లిక్ చేసి..
యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా ఐదుసార్లు.. డేటా లోన్ పొందే అవకాశాన్ని జియో
కల్పిస్తోంది.
0 Komentar