JNVST 2021: - Entrance Test for Class VI
- Exam Date Announced - Download Hall Tickets
జవహర్ నవోదయ ఎంట్రెన్స్ టెస్ట్ 2021 తేదీ ప్రకటన - అడ్మిట్ కార్డులు విడుదల
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరాకి గాను 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఖరారయ్యింది. ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణకు 11,182 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
2021-22 విద్యాసంవత్సరంలో 47,320 సీట్లకుగాను 24,17,009 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జేఎన్‌వీ ప్రవేశ పరీక్షను హిందీ, ఇంగ్లిష్ ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు.
అడ్మిట్ కార్డులను 23-07-2021 న విడుదల చేశారు.
LOGIN AND DOWNLOAD
HALL TICKETS
పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, అర్థమ్యాటిక్, ల్యాంగ్వేజ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. 80 బహులైశ్చిక ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాలను https://navodaya.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Jawahar Navodaya Vidyalaya Selection Test-2021 for the selection of students for admission to Class-VI for the session 2021-22 in Jawahar Navodaya Vidyalayas in all States & UTs will be conducted on 11th August, 2021 by following all safety precautions/COVID protocols.
— Ministry of Education (@EduMinOfIndia) July 20, 2021
0 Komentar