Mastercard Barred by RBI from Adding New
Clients in India
మాస్టర్ కార్డ్‌కు ఆర్‌బీఐ షాక్ - వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. కొత్తగా తన డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌లోకి వినియోగదారులను చేర్చుకోకుండా ఆంక్షలు విధించింది. జులై 22 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే మాస్టర్ కార్డు వినియోగిస్తున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను
దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న ఆర్‌బీఐ
ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చింది. గడువు పూర్తైనా నిబంధనలు
పాటించడంలో మాస్టర్ కార్డ్ విఫలమవ్వడంతో పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్
సిస్టమ్స్ చట్టం 2007ను (పీఎస్‌ఎస్ చట్టం) అనుసరించి
చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ కార్డులపైనా ఆర్‌బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది.
0 Komentar