Microsoft To Give $1500 Corona Bonus to
All Employees
మైక్రోసాఫ్ట్: ఉద్యోగులకు
మైక్రోసాఫ్ట్ కరోనా బోనస్!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,500 డాలర్ల(రూ.1.12 లక్షలు)ను సింగిల్ టైం బోనస్‌గా ప్రకటించింది. మహమ్మారి మూలంగా కష్టంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయి ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని పేర్కొంది. మార్చి 31, 2021కి ముందు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరి బోనస్ కోసం సంస్థ 200 మిలియన్ డాలర్లు అదనంగా కేటాయించనుంది. అయితే, కంపెనీ
అనుబంధ సంస్థలైన లింక్డిన్, గిట్‌హబ్, జెనీమ్యాక్స్‌కు చెందిన ఉద్యోగులు మాత్రం బోనస్‌కు అర్హులు కాదు. ఫేస్‌బుక్
తమ సంస్థలోని 45 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,000 డాలర్ల బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. హాలిడే బోనస్ కింద అమెజాన్
సైతం 300 డాలర్లు ప్రకటించింది.
0 Komentar