Microsoft wants you to update your
Windows PC urgently – Check the Details
కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్
చేసుకోండి - విండోస్ వినియోగదారులను కోరిన మైక్రోసాఫ్ట్
విండోస్ వినియోగదారులంతా తమ
కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్
కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ
లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది.
దాన్ని నివారించేందుకు ఓ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది.
సాధారణంగా ఒకే ప్రింటర్‌ను
ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో ‘ప్రింట్ స్పూలర్’ ఉపయోగపడుతుంది.
అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్‌ఫర్ అనే సైబర్
సెక్యూరిటీ కంపెనీ పరిశోధకులు ఈ ఏడాది మేలో తెలిపారు. దాన్ని ఎలా హ్యాక్
చేయొచ్చన్న వివరాలను పొరపాటున వారు ఆన్‌లైన్‌లో ప్రచురించారు. వెంటనే డిలీట్
చేసినప్పటికీ.. ఆ లోపే కొన్ని డెవలపర్ సైట్లలోకి సదరు సమాచారం చేరింది.
‘ప్రింట్‌నైట్‌మేర్’గా
పిలుస్తున్న ఈ లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు వివిధ ప్రోగ్రామ్‌లను ఇతరుల
కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసే ముప్పుందని; డేటాను చూడటం, డిలీట్ చేయడం, కొత్త యూజర్ అకౌంట్లను సృష్టించడం
వంటి చర్యలకూ పాల్పడే అవకాశముందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఫలితంగా
కంప్యూటర్లపై హ్యాకర్లకు పూర్తి నియంత్రణ వస్తుందని పేర్కొంది. విండోస్-10తో పాటు విండోస్-7లోనూ ఈ లోపం ఉందని తెలిపింది.
వాటికోసం అప్‌డేట్‌లను విడుదల చేసింది. ఇంతకుముందు బయటపడ్డ లోపాలనూ అధిగమించేలా
తాజా అప్‌డేట్‌లను సమగ్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపింది. వాస్తవానికి విండోస్-7కు తమ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్ గత ఏడాదే ముగించింది. అయితే- ప్రింట్‌నైట్‌మేర్
తీవ్రత దృష్ట్యా మళ్లీ ఆ వర్షన్‌కు కూడా అప్‌డేట్‌ను అందించింది.
0 Komentar