New WhatsApp Feature Will Help You
Ignore Archived Chats
వాట్సాప్: తాజాగా
ఛాట్ సెట్టింగ్స్‌కి సంబంధించి మరో కొత్త ఫీచర్
ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో
యూజర్స్‌కి సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తుంది వాట్సాప్. తాజాగా ఛాట్
సెట్టింగ్స్‌కి సంబంధించి మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్స్ తమ
ఛాట్స్‌ని పర్మినెంట్‌గా ఆర్కైవ్ చెయ్యొచ్చని తెలిపింది. గతంలో యూజర్ ఆర్కైవ్
చేసిన ఛాట్‌కి కొత్త మెసేజ్ వస్తే దానంతట అదే అన్‌ఆర్కైవ్ అవుతుంది. తాజా ఫీచర్‌తో
యూజర్ కొత్త మెసేజ్ వచ్చినా యూజర్ అన్‌ఆర్కైవ్ చేసే వరకు ఛాట్‌లు ఆర్కైవ్ మోడ్‌లోనే
ఉంటాయి. ఈ అప్‌డేట్‌తో యూజర్స్‌కి తమ ఛాట్ ఇన్‌బాక్స్‌పై మరింత కంట్రోల్ ఉంటుందని, ముఖ్యమైన
ఛాట్‌లు ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటాయని వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్,
ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. దీని కోసం యూజర్స్ తమ యాప్‌ని
అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది.
వాట్సాప్‌లో ఛాట్‌లను ఆర్కెవ్
చేసేందుకు ముందుగా సెట్టింగ్స్‌లో ఛాట్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. అందులో ఆర్కైవ్‌డ్
ఛాట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో కీప్ ఛాట్స్ ఆర్కైవ్‌డ్ ఆప్షన్‌ని
ఎనేబుల్ చేయాలి. తర్వాత మీరు ఆర్కైవ్ చేయాలనుకున్న ఛాట్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే
పైన బాణం గుర్తుతో బాక్స్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన
ఛాట్ ఆర్కైవ్ అవుతుంది. ఒకవేళ అన్‌ఆర్కైవ్ చేయాలకుంటే వాట్సాప్ పేజ్ పైన ఆర్కైవ్‌డ్
అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీరు ఆర్కైవ్ చేసిన ఛాట్స్ కనిపిస్తాయి.
వాటిపై క్లిక్ చేస్తే మీకు పైన బాణం గుర్తుతో బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్
చేస్తే మీరు ఆర్కైవ్ చేసిన ఛాట్ ఎప్పటిలానే వాట్సాప్ ఛాట్ పేజ్‌లో కనిపిస్తుంది.
Archive on WhatsApp lets you organize your private messages and prioritize important conversations. Your Archived chats will now remain archived and muted but you can always change them back! pic.twitter.com/QbAY6iu81p
— WhatsApp (@WhatsApp) July 27, 2021
0 Komentar