Nokia T20 Tablet Price, Specifications
Tipped Ahead of Launch
నోకియా కొత్త ట్యాబ్ వస్తోంది -
ఫీచర్లు మరియు ధరల వివరాలు ఇవే
కోవిడ్ మహమ్మారి వలన, లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయడం, విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కావడంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. దీంతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో రకరకాల ట్యాబ్‌లు మార్కెట్‌లో విడుదలవుతున్నాయి. నోకియా కంపెనీ కూడా కొత్త మోడల్ ట్యాబ్‌ను తీసుకురానుంది. 2014 తర్వాత నోకియా విడుదల చేస్తున్న ట్యాబ్ కావడంతో దీని ఫీచర్స్.. ధర గురించి చర్చ మొదలైంది. అలాగే నోకియా ట్యాబ్ శ్రేణిలో ఇది మూడోది. దీనికి ముందు నోకియా ఎన్1, నోకియా లుమియా 2520 పేరుతో రెండు ట్యాబ్‌లను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నోకియా కొత్త ట్యాబ్‌కి సంబంధించిన కొన్ని వివరాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..!
నోకియా టీ20 పేరుతో వైఫై, వైఫై + 4జీ కనెక్టివిటీతో రెండు వేరియంట్లలో ఈ ట్యాబ్‌ను తీసుకొస్తుంది. వైఫై వేరియంట్ ధర రూ. 19,100గాను, వైఫై + 4జీ వేరియంట్ ధర రూ. 20,900గా ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ట్యాబ్‌లో 10.36-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇస్తున్నారట. 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో తీసుకురానున్నారు. నీలం రంగులో లభిస్తుంది. ప్రాసెసర్, ఓఎస్‌తో పాటు కెమెరా వంటి వివరాలు తెలియాల్సి వుంది. వీటితోపాటు నోకియా టీఏ-1392, టీఏ-1397 పేరుతో మరో రెండు కొత్త మోడల్ ట్యాబ్‌లను తీసుకొస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీటిని భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
0 Komentar