Ola CEO Test Rides Upcoming Electric
Scooter Ahead Launch
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్: త్వరలో
మార్కెట్లోకి - వీడియో షేర్ చేసిన సీఈవో
ఓలా నుంచి త్వరలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ స్కూటర్ గురించి ప్రకటన వెలువడినప్పటి నుంచి దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారీ పెట్టుబడితో తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటవుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోందన్న సంకేతాలిస్తూ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ఓ ట్వీట్ చేశారు. బెంగళూరు వీధుల్లో ఓలా స్కూటర్‌పై చక్కర్లు కొడుతున్న వీడియోను ఉంచారు. స్కూటర్‌కు సంబంధించిన పలు ఫీచర్లను వీడియో ద్వారా పరిచయం చేశారు.
ఈ బైక్ 0-60 Kmph వేగాన్ని ఈ ట్వీట్ చదివేంత సమయంలోనే (అతి తక్కువ సమయంలోనే)
అందుకుంటుందంటూ భవిష్ పేర్కొన్నారు. మార్చుకునేందుకు వీలుగా ఉండే లిథియం అయాన్
బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్ సీటు కింది భాగంలో రెండు హాఫ్ హెల్మెట్లు పెట్టేంత
ఖాళీ ప్రదేశం ఉంటుందని చూపించారు. టెలీస్కోపిక్ సస్పెన్షన్, అదిరిపోయే లుక్ వంటివి పరిచయం చేశారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తోంది. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది.
Took this beauty for a spin! Goes 0-60 faster than you can read this tweet! Ready or not, a revolution is coming! #JoinTheRevolution @Olaelectric https://t.co/ZryubLLo6X pic.twitter.com/wPsch79Djf
— Bhavish Aggarwal (@bhash) July 2, 2021
0 Komentar