Post Office Monthly Income Scheme – Now Above
10 Years Minor Can Open Account
POMIS: 10 ఏళ్లు దాటిన
మైనర్లకు కూడా పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం
(పీఓఎమ్‌ఐఎస్), ఇది ఒక పొదుపు పథకం, దీనిలో మీరు
ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిర
వడ్డీని సంపాదించవచ్చు. ఈ ఖాతాను ఏ పోస్టాఫీసులోనైనా తెరవవచ్చు.
ఏ భారతీయ నివాసి అయినా పోస్టాఫీస్
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఖాతా తెరవవచ్చు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడి
ఖాతాను కూడా తెరవవచ్చు. అంతేకాకుండా, 10 సంవత్సరాల కంటే ఎక్కువ
వయస్సు ఉన్న మైనర్ కూడా వారి పేరుతో ఈ ఖాతాను తెరవవచ్చు.
డిపాజిట్లు:
ఈ ఖాతా తెరవడానికి అవసరమైన కనీస
మొత్తం రూ. 1,000. కానీ, ఒకరి పేరుతో ఖాతా
ప్రారంభించినప్పుడు గరిష్ఠంగా రూ.4.5 లక్షలు డిపాజిట్
చేయగలరు. ఉమ్మడి ఖాతాలో పరిమితి రూ.9 లక్షలు, దీనిలో పెట్టుబడిదారులందరికీ సమాన వాటా ఉంటుంది.
వడ్డీ రేట్లు:
ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల
పూర్తయిన తర్వాత వడ్డీ చెల్లింపు ప్రారంభమవుతుంది, ఇది మెచ్యూరిటీ
వరకు కొనసాగుతుంది. మీరు ప్రతి నెలా చెల్లించే వడ్డీని క్లెయిమ్ చేసుకోకపోతే,
అలాంటి వడ్డీపై అదనపు వడ్డీ
లభించదు. అంతేకాకుండా, నిర్ణీత పరిమితికి మించి ఎక్కువ
డిపాజిట్లు చేస్తే తిరిగి రీఫండ్ అవుతుంది. ఒకవేళ అదనపు డిపాజిట్ చేస్తే దానిపై
పోస్టాఫీసు పొదుపు ఖాతాకు ఇచ్చే వడ్డీ రేటు వర్తిస్తుంది. అది కూడా అదనపు
డిపాజిట్‌ను తిరిగి రీఫండ్ చేసేంతవరకే లభిస్తుంది.
ఆటో క్రెడిట్ ఆప్షన్ ఎంచుకుంటే
ప్రతి నెల వడ్డీని నేరుగా మీ పొదుపు ఖాతాలోకి పొందవచ్చు. అయితే ఈ వడ్డీ పన్ను
పరిధిలోకి వస్తుందని గుర్తుంచుకోండి.
అంటే ఈ వడ్డీ మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80
సి వర్తించదు.
మెచ్యూరిటీ:
మీరు ఖాతా తెరిచిన పోస్టాఫీసు వద్ద పాస్‌బుక్‌తో సూచించిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా ఐదేళ్ల తర్వాత ఖాతాను మూసివేయవచ్చు. ఒకవేళ మెచ్యూరిటీకి ముందే ఖాతాదారుడు మరణిస్తే ఆ ఖాతాను నిలిపివేసి ఆ మొత్తం డిపాజిట్‌ను నామీనీకి అందిస్తారు. అందుకే ఖాతా ప్రారంభించేటప్పుడు నామినీని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
డిపాజిట్ చేసిన తేదీ నుండి ఒక
సంవత్సరం గడువుకు ముందే ఎటువంటి డిపాజిట్ ఉపసంహరించుకునేందుకు వీలుండదు. అయితే ఒక
సంవత్సరం తర్వాత , మూడేళ్ళకు ముందు ఖాతాను ముందస్తుగా
మూసివేస్తే మొత్తం డిపాజిట్ నుంచి 2 శాతం తగ్గించి
చెల్లిస్తారు. అదేవిధంగా మూడేళ్ల నుంచి
ఐదేళ్ల మధ్య ఖాతాను నిలిపివేస్తే 1 శాతం మనహాయించి మిగతా
మొత్తం ఇస్తారు.
0 Komentar