Providing Laptops to The Eligible and
Willing Beneficiaries in Place of Financial Assistance, Under Vasathi Deevena for
Year 2021-22
వసతి దీవెనకు బదులు ల్యాప్‌టాప్‌లు - విద్యార్థుల అభీష్టానుసారం పంపిణీ - ప్రభుత్వం ఉత్తర్వులు
2021–22 విద్యా సంవత్సరంలో వసతి దీవెన కింద ఇచ్చే నగదుకు బదులు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరుకొనే వారికి వీటిని అందించనున్నారు. వీరికి రెండు రకాల కంప్యూటర్లను వారి అభీష్టాన్ని అనుసరించి పంపిణీ చేయిస్తారు. వాటిలో ఒకటి బేసిక్ కన్ఫిగరేషన్‌తో ఉన్నది కాగా రెండోది అడ్వాన్సుడ్ కన్షిగరేషన్‌తో కూడుకున్నది. ఈ ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు సంబంధించి ఏపీటీఎస్ ద్వారా విధివిధానాలు ఖరారు చేయనున్నారు.
అలాగే ఈ ల్యాప్‌టాప్‌లలో ఏమైనా
లోపాలు తలెత్తితే విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో
ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో ఆయా కంపెనీలు సమస్యను పరిష్కరించాలి. రెండు రకాల
మోడళ్లకు సంబంధించిన కన్ఫిగరేషన్ సమాచారాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత
విద్యాశాఖ) ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
Higher Education Department – NAVARATNALALU - Providing Laptops to the eligible and willing beneficiaries in place of Financial Assistance, to the students who are covered under Jagananna Vasathi Deevena for the Academic year 2021-22 – Orders- Issued.
G.O.MS.No. 41 Dated:
26-07-2021.
0 Komentar