Railways Starts Rolling Out Rajdhani
Express with Upgraded Tejas Coaches
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఇక కొత్త
అవతారంలో
- తేజస్ తరహా బోగీలతో ముస్తాబు
రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను
తేజస్ తరహా స్మార్ట్ కోచ్‌లతో భారతీయ
రైల్వే ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక ముంబయి-దిల్లీ రాజధాని
ఎక్స్‌ప్రెస్.. కొత్త కోచ్‌లతో సోమవారం ముంబయి నుంచి ప్రయాణించింది. సెన్సర్
ఆధారంగా పనిచేసే ఈ కోచ్‌లలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి కోచ్‌లోనూ
సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. రాత్రి పూట కూడా ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.
24 గంటల లైవ్ రికార్డింగ్
సదుపాయం ఉంటుంది. సీట్లకు మంటలు అంటుకోవు. సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉండేలా
రూపొందించారు. ప్రతీ సీటుకు మొబైల్ ఛార్జింగ్ పాయింటు ఉంటుంది. పైబెర్తుకు
సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కోచ్‌ల్లో తలుపులు ఆటోమేటిగ్గా
పనిచేస్తాయి. రైలు కదిలేవరకు మూసుకోవు.
0 Komentar