Rajasthan Man Sleeps for 300 Days A Year
Due to Rare Disorder
ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే - రాజస్థాన్ వాసికి అరుదైన
వ్యాధి
‘కునుకు పడితె మనసు కాస్త
కుదుట పడతది’ అనుకుంటాం. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ డివిజన్, భద్వా గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌కు మాత్రం అలా కాదు! అరుదైన అతినిద్ర
వ్యాధి (హెచ్‌పీఏ యాక్సిస్ హైపర్‌సోమ్నియా)తో బాధపడుతున్న ఆయన... ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు. చిరు వ్యాపారం చేసే పుర్ఖారామ్‌కు ఇప్పుడు 42 ఏళ్లు. 19 ఏళ్ల వయసు నుంచే ఈ వ్యాధితో
బాధపడుతున్నాడట.
ఒకసారి పడుకుంటే ఏకధాటిగా 25
రోజులపాటు మంచానికే అతుక్కుపోతున్నాడని, మధ్యలో మెలకువ రావడం
చాలా అరుదని అతని భార్య లిచ్మి దేవి చెప్పింది. నిద్రలోంచి లేచిన తర్వాత తలనొప్పి
బాధిస్తోందని బాధపడుతుంటాడని వాపోయింది. అతి నిద్ర కారణంగా పుర్ఖారామ్‌ను
స్థానికులు కుంభకర్ణుడు అని పిలవడం మొదలుపెట్టారు. మెదడులోని టీఎన్‌ఎఫ్-ఆల్ఫా
ప్రొటీన్ స్థాయుల్లో హెచ్చుతగ్గుల కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందని
శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
0 Komentar