SBI Recruitment 2021: Apply for 6100 Apprentice
Posts
ఎస్‌బిఐ లో 6100 అప్రెంటిస్ ఖాళీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 అప్రెంటిస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణ (125), ఆంధ్రప్రదేశ్ (100)లో కూడా ఖాళీలు ఉన్నాయి.
అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ
రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే
మొదలైంది. జూలై 26 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.
మొత్తం ఖాళీలు- 6100
1. ఆంధ్రప్రదేశ్- 100
నెల్లూరు -8
శ్రీకాకుళం -8
విజయనగరం -8
విశాఖపట్నం -7
తూర్పు గోదావరి -8
పశ్చిమ గోదావరి -8
కృష్ణా -7
గుంటూరు -7
ప్రకాశం -8
చిత్తూరు -8
వైఎస్ఆర్ కడప -8
అనంతపురం -8
కర్నూలు -7
2. తెలంగాణ- 125
మల్కాజ్‌గిరి -2
ఆదిలాబాద్ -3
భద్రాద్రి కొత్తగూడెం -6
జగిత్యాల్ -2
జనగాం -3
జయశంకర్ భూపాలపల్లి-3
జోగులంబ గద్వాల -2
కామారెడ్డి -4
కరీంనగర్ -4
ఖమ్మం -7
కొమరంభీమ్ -2
మహాబూబాబాద్ -3
మహబూబ్‌నగర్ -9
మంచిర్యాల -2
మెదక్ -4
నాగర్‌కర్నూల్ -4
నల్గొండ -6
నిర్మల్ -3
నిజామాబాద్ -11
పెద్దపల్లి -3
రంగారెడ్డి -6
సంగారెడ్డి -5
సిద్దిపేట -5
సిరిసిల్లా -2
సూర్యాపేట -7
వికారాబాద్ -6
వనపర్తి -3
వరంగల్ -1
వరంగల్ రూరల్ -3
యాదాద్రి భువనగిరి-4
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: గుర్తింపు పొందిన
యూనివర్సిటీ నుంచి డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి.
వయస్సు: 2020 ఆగస్ట్ 31 నాటికి 20 ఏళ్ల
నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ,
ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు
వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, టెస్ట్
ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లో ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ,
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ,
ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
శిక్షణా కాలం: ఒక ఏడాది శిక్షణ
ఉంటుంది.
స్టయిపెండ్: నెలకు రూ.15,000
పరీక్షా కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్- చీరాల, గుంటూరు,
కడప, కాకినాడ, కర్నూలు,
నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం,
తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,
విజయనగరం.
తెలంగాణ- హైదరాబాద్, ఖమ్మం,
కరీంనగర్, వరంగల్.
దరఖాస్తులు ప్రారంభం: జులై 6, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 26, 2021
ఆన్‌లైన్ పరీక్ష: 2021 ఆగస్టు
0 Komentar