Scientists Develop Pain-Free Way to Test
Blood Sugar with A Strip & Saliva
మధుమేహాన్ని గుర్తించే లాలాజల
పరీక్ష
- అభివృద్ధి చేసిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
రక్తంలోని మధుమేహ స్థాయిల్ని
గుర్తించేందుకు ఆస్ట్రేలియాకి చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని
కనుగొన్నారు. ఇప్పటివరకూ మధుమేహన్ని రక్త నమూనాల ద్వారానే అంచనా వేస్తుండగా
తొలిసారి లాలాజలంతో వాటిని గుర్తించే నూతన విధానానికి శాస్తవేత్తలు శ్రీకారం
చుట్టారు. న్యూ క్యాజిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం..‘హోలి గ్రెయిల్’గా
పిలిచే నూతన మధుమేహ టెస్టింగ్ పద్ధతిని కనుగొంది. హోలి గ్రెయిల్ పరీక్షలతో
సూదిపోటు ద్వారా రక్తాన్ని తీసే బాధాకరమైన పరిస్థితి ఉండదని శాస్త్రవేత్తలు
తెలిపారు.
గ్లూకోజ్‌ను గుర్తించే ఎంజైమ్‌ను
ట్రాన్సిస్టర్‌లో పొందుపర్చడం ద్వారా లాలాజలంలోని గ్లూకోజ్ స్థాయిల్ని
కనుగొనవచ్చని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన పాల్ దస్తోర్
పేర్కొన్నారు. ట్రాన్సిస్టర్‌లోని ఎలక్ట్రానిక్ పదార్థాలు సిరా కావడంతో తక్కువ
ఖర్చుతోనే మధుమేహ పరీక్ష చేయవచ్చని వివరించారు. ఈ పద్ధతిని ఉపయోగించి కొవిడ్
పరీక్షలతోపాటు క్యాన్సర్, అలెర్జీ పరీక్షలు నిర్వహించేలా పరిశోధనలు
జరుగుతున్నట్లు దస్తోర్ తెలిపారు. ఈ విధానం ద్వారా కొవిడ్ పరీక్షలు
నిర్వహించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన
వెల్లడించారు.
Australian scientists say they have developed the ‘holy grail’ of blood sugar testing for diabetics, a non-invasive strip that checks glucose levels via saliva https://t.co/hjttyJltL8 pic.twitter.com/TvBkeTF4GU
— Reuters (@Reuters) July 13, 2021
0 Komentar