Small Savings Schemes: సుకన్య
సమృద్ధి, పీపీఎఫ్ పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవే!
ఈ సారి కూడా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథం చేసింది. కరోనా నేపథ్యంలో 2021-22 రెండవ త్రైమాసికానికి ఇంతకు ముందున్న వడ్డీ రేట్లే కొనసాగించాలని నిర్ణయించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించకుండా, యథాతథంగా కొనసాగించడం సెప్టెంబరు 30,2021 త్రైమాసికంతో కలిపి వరుసగా ఇది ఐదవసారి. పోస్టాఫీస్ పథకాలైన పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రాలు(ఎన్ఎస్‌సి), సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై)తో పాటు ఇతర పథకాలలో జూన్30,2021 వరకు చేరిన వారు ఎంత వడ్డీ రేటు పొందారో.. జులై1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ పథకాలలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా అదే వడ్డీ రేటును పొందుతారు.
జులై-సెప్టెంబరు త్రైమాసికానికి వడ్డీ
రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదని జూన్30న కేంద్ర ప్రభుత్వం
విడుదల చేసిన సర్కులర్‌లో పేర్కొంది. దీని ప్రకారం రెండవ త్రైమాసికంలోనూ పబ్లిక్
ప్రావిండెండ్ ఫండ్ (పీపీఎఫ్) వార్షిక వడ్డీ రేటు 7.1
శాతంగానూ, జాతీయ పొదుపు పత్రాల(ఎన్ఎస్‌సీ) వార్షిక వడ్డీ
రేటు 6.8 శాతంగానూ కొనసాగనుంది. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్
వంటి వాటిలో పెట్టుబడులు పెట్టిన వారితో పోలిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాలలో
పెట్టుబడులు పెట్టిన వారికి ఎక్కువ రాబడి పొందుతారు.
0 Komentar