Technology Tips and Tricks – 1: కీ బోర్డు లోని స్పేస్ బార్ చిట్కా
వెబ్ పేజీ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, పీడీఎఫ్
డాక్యుమెంట్లు చదువుతున్నప్పుడు అప్, డౌన్ బాణం గుర్తులు
ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో తేలికగా పేజీని పైకీ, కిందికీ
స్కోల్ చేయొచ్చు. మరి ఎప్పుడైనా అప్, డౌన్ బాణం గుర్తులు
పనిచేయకపోతే? మౌస్ కర్సర్ తో పని కానిచ్చేయొచ్చు. కానీ
ప్రతిసారీ కర్సర్ ను కదిలించటం ఇబ్బందిగా ఉండొచ్చు.
మరేంటి దారి? దీనికి తేలికైన చిట్కా ఒకటుంది. అదే స్పేస్ బార్.. బ్రౌజర్ లో పేజీని ఓపెన్ చేసినప్పుడు స్పేస్ బార్ ను నొక్కితే పేజీ కిందికి రావొచ్చు. అదే షిఫ్ట్, స్పేస్ బార్ రెండిటినీ కలిపి నొక్కితే పైకి వెళ్లాచ్చు. ఇది విండోస్ 10లోనూ పనిచేస్తుంది.
0 Komentar