The Only Village in the World without Rain – Check the Details
ప్రపంచం లో అసలు వర్షం పడని ఊరు – ఎక్కడ, ఎందుకు?
=======================
కాలానుగుణంగా భూమిపై ఒక్కో చోట ఒక్కో రకమైన
వాతావరణం ఉంటుంది, వాతావరణంలో మార్పులు సహజం. కానీ, ప్రపంచంలో
కొన్ని చోట్ల కాలానికి అతీతంగా ఏడాది పొడవునా చలి పంజా విసురుతుంటుంది, ఎండలు మండిపోతుంటాయి. మరికొన్ని చోట్ల వర్షం ఎడతెరపినివ్వకుండా కురుస్తూనే
ఉంటుంది. అయితే, ఓ గ్రామంలో రోజూ ఉదయం పూట ఎండ, రాత్రి పూట చలి ఉంటుంది. కానీ, వర్షం మాత్రం ఇప్పటి
వరకూ కురవలేదు. ఎందుకంటే ఆ గ్రామం మేఘాల పైన ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా..! మరి
ఆ గ్రామం సంగతులేంటో చూద్దాం పదండి..
అల్ హుతైబ్(Al-Hutaib), యెమెన్ (Yemen) రాజధాని సనా పరిధిలో ఉన్న చిన్న
గ్రామం. ఇది భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో భారీ
కొండపై ఉంది. ఇక్కడ వర్షం కురవపోవడానికి కారణం.. గ్రామం మేఘాలకు పైన ఉండటమే. మేఘాల
కన్నా ఎత్తులో ఉన్న గ్రామంపై వర్షం ఎలా కురుస్తుంది? అది
అసాధ్యం కదా! అందుకే ఈ గ్రామంలో వర్షం పడట్లేదు. అయితే, ఈ
గ్రామానికి పర్యటకంగా మంచి పేరుంది. ఎత్తయిన కొండపై ఉన్న గ్రామంలో నిలబడి మేఘాల
నుంచి వర్షం భూమిపై పడే సుందర దృశ్యాలను, ప్రకృతిని
ఆస్వాదించొచ్చు. అందుకే ఏటా ఎంతో మంది సందర్శకులు ఈ గ్రామానికి వస్తుంటారు.
ఇక్కడ పగటి వేళ సూర్యుడు
ఉన్నంతసేపూ ఎండలు ఠారెత్తిస్తాయి. సూర్యుడు అస్తమించగానే చలి జోరు మొదలవుతుంది.
మరుసటి రోజు సూర్యుడు వచ్చే వరకు చలి పులి వెంటాడుతుంది. ఈ గ్రామంలో ప్రాచీన, ఆధునిక
పద్ధతుల్లో నిర్మించిన కట్టడాలు కనిపిస్తాయి. ఇక్కడ అల్ బోహ్రా లేదా అల్ ముఖర్మ
తెగలకు చెందిన ప్రజలకు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరిని యెమెని కమ్యూనిటీ గా
పిలుస్తుంటారు. వీరంతా ముంబయికి చెందిన మహమ్మద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలోని
ఇస్మాయిలీ(ముస్లిం) విభాగం నుంచి వచ్చి స్థిరపడినవారేనట.
=======================
=======================
0 Komentar