Tokyo Olympics 2020: Jamaica's Elaine
Thompson-Herah Wins Women's 100m Final
టోక్యో ఒలింపిక్స్ 2020: 100 మీటర్ల పరుగులో ఎలెన్ థామ్సన్ రికార్డు
టోక్యో ఒలింపిక్స్‌లో మరో రికార్డు
నమోదైంది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఎలెన్ థామ్సన్(జమైకా)
రికార్డు సృష్టించింది. కేవలం 10.61 సెకన్లలో గమ్యాన్ని
చేరుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒలింపిక్స్ క్రీడల్లో
ముఖ్యంగా మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో అతితక్కువ సమయంలోనే
గమ్యాన్ని చేరుకున్న రెండో అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది.
ఆమెకన్నా ముందు 1988 ఒలింపిక్స్‌లో గ్రిఫిత్ జాయ్‌నెర్ 10.49 సెకన్ల 100 మీటర్ల పరుగు పందేన్ని పూర్తి చేయడం ఇప్పటికీ రికార్డే. ఇక థామ్సన్
తర్వాతి స్థానంలో రెండుసార్లు ఛాంపియన్ అయిన షెల్లీ అన్నా ఫ్రాసెర్‌ను 10.74 సెకన్లతో గమ్యాన్ని చేరుకుని రజతాన్ని, షెరికా
జాక్సన్ 10.76 సెకన్లతో కాంస్య పతకాలను దక్కించుకున్నారు.
Elaine Thompson-Herah you are AMAZING!
— Olympics (@Olympics) July 31, 2021
She smashes the Olympic record to lead an all-Jamaican podium in the women's 100m!@WorldAthletics | #StrongerTogether | #Tokyo2020 | #Athletics pic.twitter.com/eJga2p7Cyi
0 Komentar