TS: 50వేల ఉద్యోగాల భర్తీకి
ముఖ్యమంత్రి ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల
భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల
భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఈమేరకు అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50వేల ఉద్యోగాలను మొదటి
దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే
ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడే
ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలన్నారు.
రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు
చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర
లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ప్రగతి భవన్‌లో
ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
“నేరుగా నింపే అవకాశాలున్న
(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50వేల
దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తాం. ఇప్పటికే అన్ని శాఖల్లో
ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడిన
ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో
కూడిన నివేదికను సిద్ధం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురండి’’ అని సీఎం
అధికారులను ఆదేశించారు.
0 Komentar