TS POLYCET-2021: Hall Tickets Released
టిఎస్ పాలిసెట్-2021 హాల్టికెట్లు
విడుదల
పదో తరగతి ఉత్తీర్ణులైన
విద్యార్థులు మూడేళ్ల పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ తో పాటు మరికొన్ని ఇతర కోర్సుల్లో
చేరడానికి నిర్వహించే పాలిసెట్-2021 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జులై 17న పరీక్ష
జరగనుండగా.. విద్యార్థులు పాలిసెట్ వెబ్ సైట్ లో తమ హాల్ టికెట్లను డౌన్లోడ్
చేసుకోవాల్సి ఉంటుంది. పాలిసెట్ రాయడానికి ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. గడువు
జూన్ 30తో ముగియగా.. మొత్తం 1,02,495 మంది దరఖాస్తు చేశారు.
గత సంవత్సరం కంటే దాదాపు 28వేల
అధికంగా పోటీ పడనున్నారు. గత ఏడాది 73,928 మందే దరఖాస్తు చేశారు. ఈసారి బాసర
ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ సీట్లను సైతం పాలిసెట్ ర్యాంకుల
ఆధారంగానే నింపనున్నారు. ఫలితంగా దరఖాస్తు చేసేవారి సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు.
ఒక్కో విద్యార్థికి రెండు ర్యాంకులు కేటాయిస్తామని పాలిసెట్ కన్వీనర్ డాక్టర్
సి.శ్రీనాథ్ చెప్పారు.
ఇంజినీరింగ్ విభాగానికి (ఎంపీసీ)
మొదట గణితం, తర్వాత భౌతిక, రసాయనశాస్త్రాల్లో
వచ్చిన మార్కుల ఆధారంగా.. అగ్రికల్చర్ కు మొదట జీవశాస్త్రం, తదనంతరం
భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితంలో
వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. అగ్రికల్చర్ విభాగంలో గణిత
ప్రశ్నలకు ఒక్కో దానికి అర మార్కు మాత్రమే కేటాయిస్తారు. పరీక్ష మొత్తం 120
మార్కులకు నిర్వహిస్తారు.
0 Komentar