TS POYCET-2021 Results Released - Counselling
Schedule Also Released – Details Here
టీఎస్ పాలిసెట్ 2021 ఫలితాలు విడుదల - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే
జూలై 28 ఫలితాలు విడుదల
ఆగస్టు 5
నుంచి తొలి విడత కౌన్సెలింగ్ మొదలు
ఆగస్టు 14న
మొదటి విడత సీట్ల కేటాయింపు
టీఎస్ పాలిసెట్ -2021 విడుదల అయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) బుధవారం ఉదయం 12 గంటలకు ఫలితాలను వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
MOBILE:
DESKTOP
TS POLYCET కౌన్సెలింగ్
షెడ్యూల్ ఖరారైంది. పాలిసెట్ ఫలితాల విడుదలకు ఒక్కరోజు ముందే పాలిటెక్నిక్
కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సైతం సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఆగస్టు 5 వ తేదీ నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
TS POLYCET కౌన్సెలింగ్
షెడ్యూల్ ఇదే:
ఆగస్టు 5
నుంచి 9 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ఉంటుంది.
ఆగస్టు 6
నుంచి 10 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది.
ఆగస్టు 6
నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్స్ కేటాయిస్తారు.
ఆగస్టు 14న
మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది.
ఆగస్టు 23
నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరుగుతుంది.
ఆగస్టు 24
తుది విడత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
ఆగస్టు 24, 25 తేదీల్లో తుది విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.
ఆగస్టు 27న
తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
సెప్టెంబర్ 1
నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 9న
స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
0 Komentar