TS: జూనియర్ పంచాయతీ
కార్యదర్శులకు వేతనం పెంపు
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన నెలసరి వేతనాన్ని రూ.15వేల నుంచి రూ.28,719కి పెంచింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. మరో వైపు ప్రొబేషన్
కాలాన్ని మూడు నుంచి నాలుగేళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
0 Komentar