UIDAI suspends these services related to
Aadhaar Card: Check details
ఆధార్ కార్డుకు సంబంధించిన ఈ
సేవలను యూఐడీఏఐ నిలిపివేత
యూఐడీఏఐ తాజాగా రెండు సర్వీసులు
సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆధార్ కార్డుదారులపై కొంత ఎఫెక్ట్
పడనుంది. ఇంతకీ యూఐడీఏఐ నిలిపివేసిన ఆ సర్వీసులు ఏంటంటే…
ఆధార్ కార్డులో అడ్రస్ వాలిడేషన్
లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇక సాధ్యం కాదు. అలాగే ఆధార్ కార్డు రీప్రింట్
సేవలు కూడా అందుబాటులోఉండవు. పాత విధానంలో ఆధార్ కార్డును రీప్రింట్ చేసుకోవడం
కుదరదు. ఈ రెండు సేవలు ఇక ఆధార్ కార్డు వాడే వారికి అందుబాటులో ఉండవు. తదుపరి
ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని యూఐడీఏఐ తెలిపింది.
1. అడ్రస్ వాలిడేషన్ లెటర్
ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. అలాగే
ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇకపై అడ్రస్ మార్చుకోవడం కష్టతరం కావొచ్చు.
2. ఇకపోతే ఆధార్ కార్డు
రీప్రింట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండవు. ఆధార్ రీప్రింట్ పొందాలని భావించే
వారు పీవీసీ కార్డు రూపంలో మాత్రమే ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది.
ట్విట్టర్‌లో ఓ యూజర్ అడిగిన
ప్రశ్నకు సమాధానంగా యూఐడీఏఐ ఈ విషయాన్ని తెలిపింది.
ఇకపోతే ఆధార్ కార్డులో తప్పులు
ఉంటే.. వాటిని సులభంగానే మార్చుకోవచ్చు. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులు ఉంటే ఇంట్లో నుంచే అప్‌డేట్
చేసుకోవచ్చు. కాగా, మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడానికి,
బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం మాత్రం కచ్చితంగా ఆధార్ కేంద్రానికి
వెళ్లాల్సి ఉంటుంది.
0 Komentar