Union Education Minister Ramesh
Pokhriyal relieved from Cabinet
కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్
రాజీనామా
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా పలు మంత్రిత్వ శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ బాధ్యతలు చూస్తున్న సంతోశ్ కుమార్ గంగ్వార్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేవశ్రీ చౌధురీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు కర్ణాటక గవర్నర్‌గా నియమితులైన థావర్ చంద్ గహ్లోత్ ఈ రోజు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని కలుసుకున్నారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఛైర్మన్ ఆ రాజీనామాను ఆమోదించారు.
43 మంది నేతల ప్రమాణ స్వీకారం..
ఈ రోజు సాయంత్రం జరగనున్న కేబినెట్
విస్తరణలో భాగంగా 43 మంది నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ
క్రమంలో ఆహ్వానం అందుకున్న నేతలు ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్నారు.
అటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీ నివాసానికి వచ్చారు. సాయంత్రం
6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది.
0 Komentar