దూరవిద్యలో బీఈడీ బంద్ - దేశవ్యాప్తంగా 40 సంప్రదాయ వర్సిటీలపై ప్రభావం
- తెలుగు రాష్ట్రాల్లో ఒక్క అంబేడ్కర్ వర్సిటీలోనే ఇక కోర్సు
గత ఏడాది నుంచి ఆగిన నోటిఫికేషన్లు
ఎన్సీటీఈ కొత్త నిబంధనలు అమలు
చేయకపోవడమే కారణం
ఉపాధ్యాయ విద్యలో నాణ్యతకు
తిలోదకాలిస్తున్న సంప్రదాయ విశ్వవిద్యాలయాలకు జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి (ఎన్
సీటీఈ) షాక్ ఇవ్వడంతో గత ఏడాది దేశవ్యాప్తంగా బీఈడీ దూరవిద్య నోటిఫికేషన్లు
ఆగిపోయాయి. ప్రత్యేకంగా నెలకొల్పిన సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో(ఓపెన్) తప్ప
మిగిలిన సుమారు 40 వర్సిటీల్లో ఆ కోర్సు బంద్ అయింది. ఈ
ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు పై అధికంగా పడిందని నిపుణులు
చెబుతున్నారు.
సొంత ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు
దాదాపు అన్ని రాష్ట్రాల్లోని సంప్రదాయ విశ్వవిద్యాలయాలు దూర విద్య విభాగాన్ని
ప్రారంభించి పలు కోర్సులను అందిస్తున్నాయి. అందులో ఒకటి బీఈడీ. ముఖ్యంగా
తమిళనాడులోని కొన్ని వర్సి టీలు వేల మందికి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రెగ్యులర్
బీఈడీ లోనే నాణ్యత అంతంతమాత్రం కాగా ఇక దూరవిద్యలో మరీ ఘోరంగా ఉందని గుర్తించిన
ఎన్‌సీటీఈ కొన్ని షరతులు విధిం చింది. ఈ నేపథంలో 2020-21 విద్యా
సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా దూరవిద్య బీఈడీ నోటిఫికేషన్లు ఆగిపోయాయి.
TS: కొత్త నిబంధనలు
రాకముందు రాష్ట్రంలో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో పాటు ఓయూ, కేయూ దూరవిద్య విభాగాలు బీఈడీ కోర్సులను అందించేవి. కొత్త నిబంధనలతో ఓయూ,
కేయూలో 2020-21 విద్యా సంవత్సరం నోటిఫికేషన్లు
ఇవ్వలేదు. అంబేడ్కర్ వర్సిటీ మాత్రం గత ఏడాది(2020-21) ప్రవేశ
పరీక్ష ప్రకటన ఇచ్చినా.. కరోనా కారణంగా పరీక్ష నిర్వహించలేకపోయింది. దాన్ని ఈ నెల 18న జరపనుంది. ఈ విద్యా సంవత్సరానికి ఇంకా ప్రకటన ఇవ్వలేదు.
AP: ఇక ఏపీలో నాగార్జున,
ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో
పోయిన సంవత్సరం నుంచి ఆ కోర్సు ఆగిపోయింది. ఫలితంగా వేల మంది అభ్యర్థులు వాటి కోసం
ఎదురుచూస్తున్నారు. దీనిపై ఓయూ దూర విద్య విభాగం సంచాలకుడు ఆచార్య జీబీ రెడ్డి మాట్లాడుతూ
తాత్కాలిక బోధనా సిబ్బందిని నియమించుకున్నామని ఎన్‌సీటీఈకి నివేదిక పంపామని,
కోర్సు మెటీరియల్ రూపకల్పన బాధ్యతలను కూడా ఎడ్యుకేషన్ విభాగానికి
అప్పగించామన్నారు. సమస్య పరిష్కారానికి ఎన్‌సీటీఈతో సంప్రదింపులు
జరుపుతున్నామన్నారు.
0 Komentar