Verify Your PAN Card Status and its
Details in The New ITR Website
ITR కొత్త వెబ్సైట్ లో మీ పాన్
కార్డ్ ఆక్టివ్ గా ఉందా లేదా మరియు దాని వివరాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోండి
ఆధార్ కార్డు ఎంత ముఖ్య మైనదో అదే
మాదిరిగా పాన్ కార్డు చాలా విలువైనది. బ్యాంక్ ఖాతా తీసుకోవాలన్న, హోమ్
లోన్, పర్సనల్ లోన్ తీసుకోవాలి అన్న పాన్ కార్డు తప్పనిసరి.
ఆదాయపు పన్ను శాఖ క్షణాల్లో పాన్
కార్డులను జారీ చేస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు
చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డు ఉంటే చాలు కేవలం నిమిషాల్లోనే ఈ-పాన్‌కార్డును
తీసుకోవచ్చు.
ఈ పాన్ కార్డు నకిలీ పాన్ కార్డు
గుర్తించడం ఎలా..?
* ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్
వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి.
* Our Service విభాగంలో 'Verify
Your PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
* ఇప్పుడు మీ పాన్ నెంబర్, పేరు,
పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ నమోదు చేసి 'Continue'
మీద చేయాలి.
* ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కు
వచ్చిన ఓటీపీని నమోదు చేసి క్లిక్ చేసి "ప్రొసీడ్" నొక్కాలి.
* ఇప్పుడు ఆ పాన్ సరైనది అయితే, "PAN is
Active and details are as per PAN" అనే మెసేజ్ వస్తుంది.
ఇలా వస్తే పాన్ కార్డు ఒరిజినల్
అని అర్ధం లేకపోతే నకిలిదీ అని గుర్తుంచుకోవాలి. పైన చెప్పిన విధంగా మీ పాన్
కార్డు నిజమైందో కాదో తెలుసుకోండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మన పేరు మీదనే
నకిలీ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు.
0 Komentar