నేడు 'విద్యా
దీవెన' రెండో విడత సాయం
693.81 కోట్లు విడుదల
చేయనున్న సీఎం
'జగనన్న విద్యా దీవెన రెండో
విడత నిధుల్ని ప్రభుత్వం గురువారం విడుదల చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో
ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ మీట నొక్కి 10.97 లక్షల మంది
విద్యార్థులకు రూ.693.81 కోట్ల బోధన రుసుముల్ని విడుదల
చేస్తారు. ఇవి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. జగనన్న విద్యా దీవెన పథకం
ద్వారా విద్యార్థులు చదివే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సుల ఫీజుల్ని నాలుగు
విడతల్లో చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఏప్రిల్ 19న
మొదటి విడత ఇవ్వగా.. గురువారం రెండో విడత చెల్లింపులు చేయనున్నట్లు వివరించింది.
డిసెంబరులో మూడు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత విడుదల
చేయనున్నట్లు వెల్లడించింది. విద్యారంగంపై ఇప్పటి వరకు రూ.26,677 కోట్లు ఖర్చు చేశామని పేర్కొంది.
0 Komentar