Virgin Galactic Unity 22 Spaceflight –
Check the Live Stream
Unity22: మొదలైన వర్జిన్
గెలాక్ట్ రోదసీ పయనం
వ్యోమనౌక వీఎస్‌ఎస్ యూనిటీ-22
రోదసీలోకి వెళ్లేందుకు అంతా సిద్ధమైంది. నిర్దేశిత సమయానికి గంటన్నర ఆలస్యంగా ఈ
యాత్ర మొదలైంది. వాతావరణ మార్పుల కారణంగా అంతరిక్ష ప్రయాణం ఆలస్యమైందని
శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త టైం షెడ్యూల్‌ను వర్జిన్ గెలాక్ట్ ట్విటర్
ద్వారా వెల్లడించింది.
వర్జిన్ గెలాక్ట్ వ్యోమనౌకలో తెలుగమ్మాయి
బండ్ల శిరీష రోదసీలోకి వెళ్తున్నారు. శిరీష సహా ఆరుగురిని యూనిటీ-22
రోదసీలోకి మోసుకెళ్లనుంది. యూనిటీ-22 సిబ్బందిలో భాగం కావడం
అదృష్టమంటూ శిరీష ట్వీట్ చేశారు. ఇప్పటికే 3 సార్లు స్పేస్
ఫైట్లను వర్జిన్ గెలాక్ట్ అంతరిక్షంలోకి పంపింది. తాజా ప్రయోగంలో మనుషులను
రోదసీలోకి తీసుకెళ్తోంది.
0 Komentar