Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WhatsApp Multi-Device Support Starts Rolling Out for Beta Testers

 

WhatsApp Multi-Device Support Starts Rolling Out for Beta Testers

మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ - బీటా యూజర్స్‌కి అందుబాటులోకి నాలుగు డివైజ్‌ల ఫీచర్‌

వాట్సాప్‌ ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ బీటా వెర్షన్‌ను ఎట్టకేలకు యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. మన ఖాతా ఉన్న ఫోన్ కాకుండా మరో నాలుగు డివైజ్‌ (ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌)లలో లాగిన్‌ కావచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాట్సాప్ వెబ్‌/లింక్‌ డివైజ్‌ ఫీచర్‌తో కేవలం ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్‌ అవ్వగలం. ఈ మల్టీ డివైజ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది.. నాలుగు డివైజ్‌లలో కనెక్ట్ అయినప్పుడు యూజర్ డేటాకు వాట్సాప్ ఎలాంటి భద్రత కల్పిస్తుందనేది తెలుసుకుందాం. 

ఎలా ఉపయోగించాలి?

వాట్సాప్ మల్టీ డివైజ్‌ ఫీచర్ ఉపయోగించాలంటే మందుగా మీ ఫోన్లో కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేస్తే లింక్‌ డివైజ్‌ (ప్రస్తుతం బీటా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫింగర్ లేదా పాస్‌వర్డ్ అథెంటికేషన్ అడుగుతుంది. (ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే) తర్వాత మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్న డివైజ్‌లో వాట్సాప్‌ వెబ్ ఓపెన్‌ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేస్తే మీ వాట్సాప్‌ ఖాతా అందులో కూడా ఓపెన్ అవుతుంది. అలా మీరు ఒకేసారి వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్ కాకుండా మరో నాలుగు డివైజ్‌లలో యాక్సిస్ చెయ్యొచ్చు. ఒకవేళ మీ ఫోన్ స్విచ్‌ఆఫ్ అయినా మీరు లాగిన్ అయిన నాలుగు డివైజ్‌ల నుంచి వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అలానే మీ కాంటాక్ట్ లిస్ట్‌, ఛాట్‌ హిస్టరీ అన్ని వేర్వేరుగా సదరు డివైజ్‌లకు కనెక్ట్ అవుతాయని వాట్సాప్ పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా ఇక మీదట యాపిల్‌ ఐపాడ్‌లలో కూడా వాట్సాప్ ఉపయోగించవచ్చు.

భద్రత మాటేంటి?

మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌తో యూజర్స్‌ తమ డేటా (వ్యక్తిగత సమాచారం, మెసేజ్‌లు, మెసేజ్ హిస్టరీ, కాంటాక్ట్స్‌, స్టార్డ్ మెసేజ్‌లు) గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వాట్సాప్ వెల్లడించింది. మొబైల్‌లో ఉన్నట్లుగా ప్రతి డివైజ్‌కి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని తెలిపింది. అంటే వేర్వేరు డివైజ్‌లలో లాగిన్‌ అయిన తర్వాత మీరు పంపే మెసేజ్‌లు వేర్వేరుగా ఎన్‌క్రిప్ట్ అయ్యేలా మల్టీ డివైజ్ సెక్యూరిటీ ఫీచర్‌ను అభివృద్ధి చేశామని వాట్సాప్ తెలిపింది. ఇదే విధానాన్ని ఆడియో/వీడియో కాల్స్‌కి పాటిస్తామని విల్ పేర్కొన్నారు. 

ఒకవేళ మీ వాట్సాప్‌ ఖాతా ఉన్న డివైజ్‌లలో ఒకదాన్ని హ్యాక్ చేసి దాన్నుంచి మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని వారికి మెసేజ్‌ పంపినా.. దాన్ని మీరు పంపారా లేదా అనేది వారు తెలుసుకునేందుకు వీలుగా సెక్యూరిటీ కోడ్స్ ఫీచర్ తీసుకొస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. అంటే మీ ఖాతా నుంచి వచ్చిన మెసేజ్‌పై అవతలి వారికి అనుమానం కలిగితే వెంటనే వారు సెక్యూరిటీ కోడ్ సాయంతో ఏ డివైజ్‌ నుంచి మెసేజ్ వచ్చిందనేది తెలుసుకోవచ్చు. దాంతో మీరు ఆ టైంలో మెసేజ్ పంపిన డివైజ్‌ను ఉపయోగిస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. అలానే ఆటోమేటిక్ డివైజ్ వెరిఫికేషన్ పేరుతో మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని సాయంతో యూజర్స్ గతంలో వాట్సాప్ లాగిన్ అయిన డివైజ్‌లలో తిరిగి సులువుగా లాగిన్‌ అయ్యేందుకు ఉపయోగపడుతుందని వాట్సాప్ తెలిపింది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags