WhatsApp to Soon Allow You to Select
Video Quality
వాట్సాప్: వీడియోల
అప్‌లోడ్ క్వాలిటీ కోసం కొత్త ఫీచర్
మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది. వీడియో అప్‌లోడ్ క్వాలిటీ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ తాము ఎంత క్వాలిటీతో వీడియోలను పంపాలనుకునేది నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం విడుదల చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. వాట్సాప్ 16 ఎంబీ సామర్థ్యం కలిగిన మీడియా ఫైల్స్‌ను ఇతరులతో షేర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. రాబోయే అప్‌డేట్‌లో వీడియో అప్‌లోడ్ క్వాలిటీని యూజర్స్ ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.
ఇందులో ఆటో (రికమండెడ్), బెస్ట్
క్వాలిటీ, డేటా సేవర్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ఆటో ఆప్షన్
కంప్రెషన్ అల్గారిథమ్‌తో కొన్ని రకాల వీడియోలను సైజ్‌ను తక్కువ చేసి పంపేందుకు
ఉపయోగపడుతుంది. బెస్ట్ క్వాలిటీ ద్వారా హై-రిజల్యూషన్ వీడియోలను పంపొచ్చు.
హై-బ్యాండ్‌విడ్త్ నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు డేటా సేవర్ ఆప్షన్‌ను
ఉపయోగించి వీడియోలను షేర్ చెయ్యొచ్చు. అయితే బెస్ట్ క్వాలిటీ ఆప్షన్ ద్వారా ఎంత
వేగంగా వీడియో పంపాలనేది మీరు ఉపయోగిస్తున్న డివైజ్, నెట్‌వర్క్
స్పీడ్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను
భవిష్యత్తులో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.
0 Komentar