WhatsApp will let you TRANSFER Chats
from iOS to Android - Check The Details Here
వాట్సాప్: ఐఫోన్ టు ఆండ్రాయిడ్ - ఛాట్ ట్రాన్స్‌ఫర్ గురించి అప్డేట్ ఇదే
వాట్సాప్ వరుసగా కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. ఆర్కైవ్ అప్‌డేట్, గ్రూప్ వీడియోకాలింగ్ వంటి ఫీచర్స్‌ని ఇప్పటికే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవేకాకుండా మల్టీ డివైజ్ సపోర్ట్, వ్యూవన్స్, వాయిస్ మెసేజ్ రివ్యూ, రిక్వెస్ట్ ఏ రివ్యూ ఫీచర్స్‌ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా ఈ జాబితాలోకి మరో కొత్త ఫీచర్ వచ్చి చేరనుంది. యూజర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఛాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను తీసుకురానుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.
ఉదాహరణకు మీరు ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నారనుకుందాం. అందులోని వాట్సాప్ ఛాట్‌ని మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి మార్చుకోవాలనుకున్నారు. గతంలో ఇలా చేయాలంటే క్లౌడ్‌లో బ్యాక్‌అప్ చేసుకుని అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకునేవారు. దీనివల్ల కొన్నిసార్లు ఎంతో కొంత డేటా కోల్పోవచ్చు. అలానే క్లౌడ్‌లో మొత్తం ఛాట్‌ని బ్యాక్ అప్ చేసుకునేందుకు స్టోరేజ్ సరిపోదు. ఎందుకంటే క్లౌడ్ స్టోరేజ్‌పై కూడా పరిమితులు ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మీ ఐఫోన్‌లో ఉన్న ఛాట్ డేటా మొత్తాన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌కి ఒక్క క్లిక్‌తో సులువుగా మార్చుకునేలా వాట్సాప్ ఛాట్ ట్రాన్స్‌ఫర్ పేరుతో కొత్త ఫీచర్‌ని తీసుకొస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే యూజర్స్‌కి పరిచయం చేయనుంది.
Thank you @xdadevelopers for your recent discovery about the "Switch to Android" app, to migrate WhatsApp chat history from iOS to Android. 🤩
— WABetaInfo (@WABetaInfo) July 28, 2021
These screenshots show how the process works. This feature is under development and it will be available in a future update. https://t.co/FmZbXi33L2 pic.twitter.com/w7GiCUHSuS
వాట్సాప్ ప్రారంభం నుంచి ఎక్కువ
శాతం మంది యూజర్స్ ఛాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎట్టకేలకు దీనిపై దృష్టిసారించిన వాట్సాప్ మరికొద్ది వారాల్లో ఈ ఫీచర్‌ను యూజర్స్‌కి
అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. మీకు వాట్సాప్
సెట్టింగ్స్‌లో ఛాట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే అందులో మూవ్ ఛాట్స్ టు ఆండ్రాయిడ్ అనే
ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఛాట్ డేటా మొత్తం సులభంగా ట్రాన్స్‌ఫర్
అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఫీచర్ ద్వారా ఛాట్ డేటా ఫోన్ నుంచి ఆండ్రాయిడ్
ఫోన్‌కి మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కి ఛాట్
డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా ఈ ఫీచర్‌ని అప్‌డేట్ చేస్తారని టెక్ వర్గాలు
అభిప్రాయపడుతున్నాయి.
0 Komentar