Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

World Emoji Day: మాటలకు బదులుగా ఎమోజీలు – ఈ ఎమోజీ ఎలా పుట్టుకొచ్చింది

 

World Emoji Day: మాటలకు బదులుగా ఎమోజీలు – ఈ ఎమోజీ ఎలా పుట్టుకొచ్చింది

సంతోషం, ప్రేమ, అసూయ..బాధ ఇలా రకరకాల ఎన్నో భావాలను ఒక్క ఎమోజీతో వ్యక్తపర్చవచ్చు. మాట్లాడే అవసరం లేకుండా భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో బాగా పాపులర్‌ అయ్యింది ఎమోజీ. అందుకే ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకొంటాము. ఈ సందర్భంగా ఎమోజీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

సోషల్ మీడియా నుంచి ఎస్‌ఎంఎస్‌ల వరకూ దేనిలోనైనా మన భావోద్వేగాలను ఎదుటివారికి తెలియజేయాలంటే వెంటనే గుర్తొచ్చేది ఎమోజీలు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో వీటి వినియోగం ఎక్కువైపోయింది. ముఖ్యంగా వాట్సాప్‌లో చాటింగ్ చేసేప్పుడు చాలామంది వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. 

అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ బంబుల్ వరల్డ్‌ ఎమోజీ సందర్భంగా ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కరోనా కారణంగా ఎమోజీల వినియోగం 2020 నుంచి 2021 మధ్యకాలంలో 86 శాతానికి పెరగడంతో పాటు సోషల్‌ మీడియా, ఇతర సైట్లలో యాక్టీవ్‌ గా ఉన్నట్లు నిర్ధారించింది. ఇక ఇండియన్స్‌ చెందిన మిలీనియల్స్‌ (దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉన్నయువత) క్లాసిక్‌ రెడ్‌ హార్ట్‌ ఎమోజీని ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఈ ఎమోజీల్లో టాప్‌ 5లో ఉంది. రెడ్‌ హార్ట్‌, కన్నుగీటేది, కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, సన్‌ గ్లాసెస్‌ ఎమోజీ, కళ్లతో నవ్వే స్మైల్‌ని వినియోగిస‍్తున్నారు. సోషల్‌ మీడియా ప్రొఫైళ్లలో నెటిజన్లు రెడ్‌ హార్ట్‌ ఎమోజీని వినియోగిస్తున్నారని బంబుల్‌ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ తెలిపారు. 

ఎమోజీ ఎలా పుట్టుకొచ్చింది:

మొదటి సారి ఎమోజీని అమెరికా 16వ అధ‍్యక్షుడు అబ్రహం లింకన్‌ ప్రసంగంతో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 1862లో లింకన్‌ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల ఆహభావాలు అభిమానుల్ని ఎంతగానే అలరించాయి. ఆ ఆహభావాలలో కన్నుగీటేది బాగా పాపులర్‌ అయ్యింది. నాడు పలు మీడియా సంస్థలు పేపర్లలో ఆయన ప్రసంగం పక్కనే కన్ను గీటే ఎమోజీల్ని పెట్టారట. అలా ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. 

అంతేకాకుండా.. జీమెయిల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి అందుబాటులోకి రాకముందు ఎక్కువ మంది యాహూ మెయిల్, యాహూ మెసెంజర్‌లను ఉపయోగించేవారు. చాటింగ్‌లో ఎదుటి వ్యక్తి కనిపించరు కాబట్టి.. వారి హవభావాలు తెలిసేందుకు వీలుగా యాహూ ఈ ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. 2010 తర్వాత ఈ ఎమోజీలు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోకి కూడా వచ్చి చేరాయి. అయితే, ఏమోజీలను ప్రవేశపెట్టిన ఘనత మాత్రం యాహూది కాదు. జపాన్‌‌ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్‌టీటీ డొకామో’లో పనిచేసిన షిగెటకా కురిటా అనే ఇంజినీర్‌ వీటిని రూపొందించాడని చెబుతుంటారు. 

వీటిని ఎలా ఆమోదిస్తారు:

ఎమోజీ ఎవరు పడితే వారు విడుదల చేయరు. యూనికోడ్ కన్సార్టియం ఆమోదం లభించిన తర్వాతే ఏటా వీటిని విడుదల చేస్తారు. ఇవి ఒకసారి మార్కెట్లోకి విడుదల కాగానే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వంటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తమ మొబైళ్లలో వాటిని అందుబాటులోకి తెస్తాయి. ఈ యూనికోడ్ కాన్సార్టియంలో నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, గూగుల్, టిండర్, ట్విట్టర్ తదితర సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఇక బంబుల్‌ నివేదిక ప్రకారం .. ఎమోజీల వినియోగం అధికంగా ఉండటంతో ఆయా కంపెనీలు యూజర్లను అట్రాక్ట్‌ చేసేలా వాయిస్‌ను సెండ్‌ చేస్తే దానికి తగ్గట్లు డీఫాల్ట్‌గా ఎమోజీ రెడీ అయ్యేలా డిజైన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

LIST OF EMOJIS AND MEANINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags