Amazon Alexa Can Now Help You to Find Covid-19
Vaccine and Testing Centres
అమెజాన్ అలెక్సాలో వ్యాక్సిన్
సమాచారం -
టెస్టింగ్ సెంటర్లు, కేసుల సంఖ్యల వివరాలు
కూడా
మీ దగ్గర అమెజాన్ అలెక్సా ఉందా? ఇప్పటి
వరకూ వినోదానికి పరిమితమైన ఈ పరికరం ఇప్పుడు మీ ఆరోగ్య భద్రతకు తోడు కానుంది.
ఎలాగంటారా! ఇందులో ఉండే వర్చ్యూవల్ అసిస్టెంట్ ద్వారా కొవిడ్ టెస్టింగ్
సెంటర్లు, వ్యాక్సినేషన్ సెంటర్లు మీ సమీప ప్రాంతాల్లో
ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చని అమెజాన్ ఇండియా పేర్కొంది.
కొవిడ్ హెల్ప్‌లైన్ నెంబర్లతో
పాటు కొవిడ్ రిలీఫ్‌కి తోడ్పాటు అందించే వారి వివరాలు పొందచ్చు. ఇందులో వచ్చే
సమాచారం అంతా కొవిన్ పోర్టల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్రత్వ శాఖ
వెబ్‌సైట్, మైమ్యాప్ ఇండియా ద్వారా వస్తుంది. అంతే కాదు..
వైరస్‌కు సంబంధించిన లక్షణాలు, రోజూ భారత్‌లో నమోదవుతున్న
కేసుల సంఖ్యల వివరాలను అమెజాన్ ఎకో అందించనుంది. భారత్‌లోని ఎన్జీవోలు అక్షయపాత్ర,
గివ్ ఇండియా, గూంజ్‌లతో అనుసంధానమై కావాల్సిన
సేవలు ఇస్తున్నాయి. ఇవన్నీ పొందాలంటే మీ స్మార్ట్ ఫొన్లలోని అమెజాన్ యాప్
లేటస్ట్ వర్షెన్‌తో అప్‌డేట్‌గా ఉండాలి.
0 Komentar