AP BIE: Fixation of fee structure for Intermediate
Courses of Private Un-Aided Junior Colleges
ఏపి: ప్రైవేటు జూనియర్ కళాశాలల వార్షిక ఫీజుల ఖరారు - గ్రామాల్లో రూ. 15 వేలు - నగరాల్లో రూ. 20 వేలు -వివరాలు ఇవే
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసును ఆమోదిస్తూ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్ రెండేళ్ల కోర్సులకు సంబంధించి 2021-22 నుంచి 2023-24 వరకు ఇవి వర్తిస్తాయని పేర్కొన్నారు.
* ఎంపీసీ, బైపీసీ కోర్సులకు ఏడాదికి గరిష్ఠంగా. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలలైతే
రూ.15 వేలు, పురపాలక సంఘాల్లో ఉంటే రూ.17,500,
నగర పాలక సంస్థల్లోని వాటికి రూ.20 వేలు వసూలు
చేయాలి.
* సీఈసీ, హెచ్‌ఈసీ తదితర కోర్సులకు గరిష్ఠంగా ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.12 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15
వేలు, నగర పాలక సంస్థల్లో రూ.18 వేలు
తీసుకోవాలి.
* ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, ప్రవేశం, పరీక్ష, లేబొరేటరీ,
క్రీడలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, అదనపు బోధనా కార్యకలాపాలు, విద్యార్థి సంక్షేమ నిధి, ఆరోగ్య సంరక్షణ పథకం,
స్టడీటూర్, అల్యూమ్ని, ఇతర
విద్యాసంబంధ రుసుములన్నీ ఇందులోనే కలిసి ఉంటాయి.
* విద్యార్థి ఎంచుకుంటే...
అదనంగా రవాణా, వసతి తదితర రుసుములు తీసుకోవచ్చు. రవాణా
రుసుములకు సంబంధించి.. కిలో మీటరుకు రూ.1.20 చొప్పున
తీసుకోవాలి. వసతిగృహాల్లో ఉండే వారైతే ఏడాదికి.. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో
రూ.18 వేలు, పురపాలక సంఘాల్లోని వాటికి
రూ.20 వేలు, నగర పాలక సంస్థల్లో ఉంటే
రూ.24 వేలకు మించకూడదు.
* ఏ ప్రాంతంలోని
ట్యుటోరియల్ కళాశాలలైనా (ఇంటర్‌తోపాటు జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ) లెక్చరర్లు, మెటీరియల్ సరఫరా, పరీక్షలకు అదనంగా రూ.20 వేలు చొప్పున తీసుకోవాలి.
* ప్రతి విద్యార్థి నుంచి
వసూలు చేసే ఫీజులకు సంబంధించిన రసీదులను. వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఆదాయపు పన్ను
వివరాలతో కూడిన ఆర్థిక నివేదికలను బహిరంగంగా ప్రదర్శించాలి. ఆదాయపు పన్ను
మినహాయింపులను పొందుపరచాలి.
* ఫీజులు తక్కువగా ఉన్నాయని,
దీర్ఘకాలం నిర్వహించలేమని ఏదైనా జూనియర్ కళాశాల యాజమాన్యం భావిస్తే
ప్రకటన వెలువడిన 15 రోజుల్లోగా తగిన కారణాలు వివరిస్తూ
ప్రతిపాదిత నమూనాలో(బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు,
వారి అర్హతలు, విద్యుత్తు ఛార్జీలు, ఇంధనం, క్రీడా పరికరాలు, గ్రంథాలయం,
పుస్తకాలు, ల్యాబ్ వస్తువులు.. తదితర
వివరాలతో కమిషన్ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేయాలి. సంబంధిత పత్రాలను అప్‌లోడ్
చేయాలి. ఫిర్యాదును పరిష్కరించే దాకా ఎలాంటి అదనపు ఫీజులూ వసూలు చేయకూడదు.
0 Komentar