AP
Covid-19 Media Bulletin 04-08-2021
ఏపీలో
కొత్తగా 2,442 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా 2,442 కొత్త కేసులు నమోదయ్యాయి. 16 మంది మృతి చెందారు.
కరోనా నుంచి నిన్న 2,412 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో
ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ
బులెటిన్‌లో తెలిపింది.
కొవిడ్
వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం,
కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున,
తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం
జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
0 Komentar