AP
Covid-19 Media Bulletin 15-08-2021
ఏపీలో
కొత్తగా 1,506 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,500 పరీక్షలు నిర్వహించగా.. 1,506 కేసులు
నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,93,697 మంది వైరస్
బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో
కొవిడ్ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య
13,647కి చేరింది.
24
గంటల వ్యవధిలో 1,835 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి
సంఖ్య 19,62,185కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో
17,865 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,56,61,449 నమూనాలను
ఆరోగ్య శాఖ పరీక్షించింది.
0 Komentar