AP: Fixation of Fee Structure for
Nursery to 10th Class in Private Un-Aided Schools
ఏపి: ప్రైవేటు పాఠశాలల్లో వార్షిక ఫీజుల ఖరారు - పదో తరగతికి రూ.18 వేలు - నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఫీజుల వివరాలు ఇవే
ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చేసిన సిఫారసుల్ని ఆమోదిస్తూ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. 2021-22 నుంచి 2023-24 వరకు ఈ ఫీజులు వర్తిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థి ఎంచుకుంటే మాత్రం అదనంగా రవాణా రుసుము తీసుకోవచ్చు. ఇందుకు కిలోమీటరుకు రూ.1.20 చొప్పున తీసుకోవాలి.
* ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, ప్రవేశం, పరీక్ష, లేబొరేటరీ, క్రీడలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయ, అదనపు బోధనా కార్యకలాపాలు, విద్యార్థి సంక్షేమ నిధి, ఆరోగ్య సంరక్షణ పథకం, స్టడీ టూర్, అల్యూమ్ని, ఇతర విద్యా సంబంధ రుసుములన్నీ ఇందులోనే కలిసి ఉంటాయి. అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటారు.
* ట్యుటోరియల్ పాఠశాలలు.. బోధన, మెటీరియల్, పరీక్షల నిర్వహణ పేరిట ఎలాంటి రుసుములు వసూలు చేసేందుకు అనుమతించరు. క్యాపిటేషన్ రుసుములు వసూలు చేయకూడదు. ప్రత్యేకించిన దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలని చెప్పకూడదు. కనీసం అయిదేళ్ల వరకు యూనిఫాం మార్చకూడదు. మార్చాల్సి వస్తే అందుకు కారణాలు తెలియజేయాలి.
* ఫీజులు తక్కువగా ఉన్నాయని,
దీర్ఘకాలం నిర్వహించలేమని ఏదైనా పాఠశాల యాజమాన్యం భావిస్తే.. ప్రకటన
వెలువడ్డ 15 రోజుల్లోగా తగిన కారణాలు వివరిస్తూ ప్రతిపాదిత
నమూనాలో కమిషన్ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేయాలి. ఫిర్యాదును పరిష్కరించే వరకు అదనపు
ఫీజులు వసూలు చేయకూడదు.
0 Komentar