AP: Online Migration Certificate for SSC
Students
ఏపీ: టెన్త్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన
విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో మైగ్రేషన్ సర్టిఫికేట్
ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్దులకు ఆన్‌లైన్‌లో మైగ్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. ఇందుకోసం విద్యార్ధులు 80 రూపాయిలు చెల్లించి విద్యా శాఖ వెబ్‌సైట్ www.bse.ap.gov.in 2021 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
రేపటి (ఆగష్టు 24) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది.
కాగా, 2004 తర్వాత టెన్త్ పాసైన విద్యార్ధులు సైతం మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ తెలిపింది. ఉన్నత విద్యను
అభ్యసించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకున్న విద్యార్ధులు మైగ్రేషన్
సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
0 Komentar