AP: SSC పరీక్షలలో ఉత్తీర్ణత సాదించిన విద్యార్థులు మైగ్రేషన్ సర్టిఫికెట్ పొందుటకు పత్రికా ప్రకటన 10-08-2021
AP: SSC పరీక్షలలో ఉత్తీర్ణత సాదించిన విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి - HMలకు పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశం 👇
ఆంధ్ర ప్రదేశ్ లో 2020-21 విద్యా సంవత్సరానికి సంభందించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు 06-08-2021 తేదీన విడుదల చేయడమైనది. ఉన్నత విద్యను అభ్యసించడానికి పొరుగు
రాష్ట్రాలకు వెళ్ళే పదవ తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్ధుల సౌలభ్యాన్ని దృష్టిలో
ఉంచుకొని పరీక్ష రుసుముతో పాటు Rs.80/- చెల్లించిన వారికి
మైగ్రేషన్ సర్టిఫికెట్ సంభందిత పాఠశాల లాగిన్ లో పొందుపరచడం జరిగినది. ఈ మైగ్రేషన్
సర్టిఫికెట్ కలర్ కాపీని సంభందిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు
అందజేయవలెను. ఈ అవకాశం 05-09-2021 వరకు మాత్రమే అందుబాటులో
ఉంటుంది. ఆ తరువాత మైగ్రేషన్ సర్టిఫికెట్ పొందగోరు విద్యార్ధులు మరలా RS.80/-
రుసుము చెల్లించి ఆన్లైన్ లో ప్రభుత్వ పరీక్షల సంచాలకులవారి కార్యాలయానికి
దరఖాస్తు చేసుకొని మైగ్రేషన్ సర్టిఫికెట్ పొందగలరు.
2021 మాత్రమే కాకుండా పూర్వపు సంవత్సరాలలో పదవ తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్ధులు కూడా ఈ సంవత్సరం నుండి మైగ్రేషన్ సర్టిఫికెట్ కొరకు ఆన్లైన్ లో ప్రభుత్వ పరీక్షల సంచాలకులవారి కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించడం జరుగుతుంది. విద్యార్ధి దరఖాస్తు తేది నుండి 30 రోజుల వరకు మాత్రమే వెబ్ సైట్ నందు మైగ్రేషన్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేసుకొనుటకు తగిన సూచనలు మరియు విధి విధానాలు త్వరలో ఒక వీడియో మరియు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ద్వారా www.bse.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచడం జరుగుతుంది.
ఆర్.సి.నెం.36/J-1/2021 తేదీ: 10-08-2021.
పత్రికా ప్రకటన
0 Komentar