AP State & Subordinate Service
Rules, 1996 – Amendment to Rule-22
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు
ప్రభుత్వ సర్వీసు నిబంధనల్లో సవరణ
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు
వీలుగా 1996 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, సబార్డినేట్ సర్వీసు నిబంధనల్ని సవరిస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్
నోటిఫికేషన్ జారీ చేసింది.
సర్వీసు నిబంధనల్లోని రూల్-2 (31) తర్వాత... 32. ఎస్సీ, ఎస్టీ,
బీసీ వర్గాలకు ఇస్తున్న రిజర్వేషన్ల పరిధిలోకి రానివారిలో కుటుంబ
వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించని వారిని ఆర్థికంగా
వెనుకబడిన వర్గాలవారుగా గుర్తించి రిజర్వేషన్ కల్పించాలి' అని
చేర్చింది.
రూల్ 22లోని
సబ్ రూల్(1)లో మాజీ సైనికోద్యోగులు అన్న పదం తర్వాత
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అన్న మాటలు చేర్చింది. సబ్ రూల్-2లో 'నేరుగా జరిపే ప్రభుత్వ నియామకాల్లో ఎస్సీలకు 15
శాతం, ఎస్టీలకు 6 శాతం,
బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యూఎస్
వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను ఓపెన్ కాంపిటీషన్
ప్రాతిపదికన కల్పించాలి. కుటుంబానికి.. వేతనం, వ్యవసాయం,
వ్యాపారం, ఇతర వృత్తుల ద్వారా వచ్చే మొత్తం
వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉంటేనే ఈడబ్ల్యూఎస్
రిజర్వేషన్లకు అర్హులు' అని చేర్చినట్లు తెలిపింది.
The Andhra Pradesh State &
Subordinate Service Rules, 1996 – Amendment to Rule-22– Notification - Orders –
Issued.
G.O.MS.No. 73 Dated: 04-08-2021.
ఉద్యోగాల్లో
ఈడబ్ల్యూఎస్ కోటా - విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ అమలు – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
0 Komentar