BEL Recruitment 2021: Apply for 511 Trainee
Engineer & Project Engineer Posts
బెల్, బెంగళూరులో
511 పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ
శాఖకి చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఒప్పంద
ప్రాతపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు..
మొత్తం ఖాళీలు: 511
1) ట్రెయినీ ఇంజినీర్లు: 308
2) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 203
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
నాలుగేళ్ల ఫుల్ టైం బీఈ/ బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ట్రెయినీ ఇంజినీర్
పోస్టులకి ఫ్రెషర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ఇంజినీర్ పోస్టులకి
రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి ట్రెయినీ
ఇంజినీర్ పోస్టులకి 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకి 28
ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: ట్రెయినీ ఇంజినీర్
పోస్టులకి మొదటి ఏడాది నెలకి రూ.25000, రెండో ఏడాది నెలకి
రూ.28000, మూడో ఏడాది నెలకి రూ.31000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకి పోస్టులకి మొదటి ఏడాది నెలకి రూ.35000, రెండో ఏడాది నెలకి రూ.40000, మూడో ఏడాది నెలకి
రూ.45000, నాలుగో ఏడాది నెలకి రూ.50000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: బీఈ/ బీటెక్ లో
సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ట్రెయినీ ఇంజినీర్
పోస్టులకి రూ.200, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి రూ.500
చెల్లించాలి.
ఆన్ లైన్ దరఖాస్తులకి చివరి తేది:
15.08.2021.
0 Komentar