Book Covid Vaccine
Slots on WhatsApp – Details Here
Corona Vaccine: ఇక
వాట్సాప్‌లోనూ టీకా ‘స్లాట్ బుకింగ్' - వివరాలు ఇవే
కోవిడ్ మూడో దశ ముప్పు పొంచి ఉన్న
వేళ వీలైనంత వేగంగా అర్హులైన వారందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా
పెట్టుకుంది. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం
తీసుకొచ్చింది. ప్రజల సౌకర్యార్థం ఇకపై వాట్సాప్‌లోనూ టీకా స్లాట్‌ను బుక్ చేసుకునే
వీలు కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం
ట్విటర్ వేదికగా వెల్లడించారు.
‘‘పౌరుల సేవలో కొత్త
శకానికి నాంది పలుకుతున్నాం. ఇక కరోనా వ్యాక్సిన్ స్లాట్లను అత్యంత సులువుగా మీ
ఫోన్‌లోనే క్షణాల్లో బుక్ చేసుకోవచ్చు’’ అని కేంద్రమంత్రి ప్రకటించారు. దీంతో
పాటు వాట్సాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో కూడా వివరించారు. అటు మై గవర్న్‌మెంట్
ఇండియా ట్విటర్ ఖాతాలోనూ ఈ కొత్త సదుపాయం గురించి ట్వీట్ చేశారు.
వాట్సాప్ ద్వారా టీకా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలంటే 👇
* ఇందుకోసం ముందు MyGovIndia
Corona Helpdesk నంబరు 91-9013151515ను మీ
కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవాలి.
* ఆ తర్వాత వాట్సాప్‌లో ఈ
నంబరుకు ‘Book Slot’ అని మెసేజ్ పంపాలి.
* అప్పుడు మీ ఫోన్ నంబరుకు
ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నంబరు వెరిఫై చేసుకోవాలి.
* ఆ తర్వాత తేది, లొకేషన్, పిన్‌కోడ్, వ్యాక్సిన్
టైప్ తదితర వివరాలను నింపాలి.
* అన్నీ పూర్తయ్యాక Confirm
చేస్తే మీకు స్లాట్ బుక్ అవుతుంది.
మీ మొబైల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
మీ మొబైల్ ఫోన్ ద్వారా టీకా బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి
కరోనా సంబంధిత సమాచారాన్ని ప్రజలకు వాట్సాప్ ద్వారా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ‘MyGov Corona Helpdesk’.. ఇటీవల టీకా ధ్రువపత్రాన్ని కూడా వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 9013151515 నంబరుకు వాట్సాప్‌లో ‘Download Certificate’ అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ వెరిఫై చేసుకుని, పేరును ధ్రువీకరిస్తే మీ టీకా సర్టిఫికేట్ డౌన్‌లోడ్ అవుతుంది.
Now you can book your vaccination slot on WhatsApp!
— MyGovIndia (@mygovindia) August 24, 2021
All you have to do is simply send 'Book Slot' to MyGovIndia Corona Helpdesk, verify OTP and follow these few simple steps.
Visit https://t.co/97Wqddbz7k today! #IndiaFightsCorona @MoHFW_INDIA @PMOIndia pic.twitter.com/HQgyZfkHfv
0 Komentar