Centre Notifies Amended Rules for
Single-Use Plastic Items
సింగిల్ యూజ్ ప్లాస్టిక్
వినియోగంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) వస్తువులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్
ప్లేట్లు కప్పులు, స్ట్రాలు, ట్రేలపై ఈ
నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది. సింగిల్ యూజ్
ప్లాస్టిక్ తయారీ, విక్రయం, వాడకంపై ఈ
నిషేధం ఉంటుందని తెలిపింది. అలాగే ప్టాస్టిక్ క్యారీ బ్యాగుల (పాలిథిన్ సంచులు)
వాడకంపై కొత్త ఆంక్షలను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 30 నుంచి
75 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లకే అనుమతి ఉంటుందని
తెలిపింది. వచ్చే ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్ల కవర్లే వాడాలని స్పష్టంచేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నివారణే
లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న కవర్లకే అనుమతి ఉంది.
0 Komentar