పాఠశాల సిబ్బందికి వ్యాక్సిన్
తప్పనిసరి – ఆగస్టు 16 నుంచి విద్యా
సంస్థల్లోకి అనుమతి, జీతాల బిల్లుల గురించి చిత్తూరు డీఈవో
పురుషోత్తం
ప్రభుత్వ పాఠశాలల్లోని బోధన, బోధనేతర
సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి
పురుషోత్తం తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కోవాగ్జిన్ మొదటి డోసు
వేయించుకున్నవారు 28 రోజుల తరువాత, కోవిషీల్డు
వేయించుకున్న వారు 84 రోజుల గడువుతో రెండో డోసు
వేయించుకోవాలన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉన్నవారు వెంటనే మొదటి
డోసు వేయించుకోవాలన్నారు.
నిబంధనలు పాటించనివారిని ఆగస్టు 16 నుంచి విద్యా సంస్థల్లోకి అనుమతించేది లేదని చెప్పారు. అటువంటి వారి జీతాల బిల్లులు డీఈఓ దృష్టికి తీసుకువచ్చిన తరువాత మాత్రమే పెట్టాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకోనివారు దానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు వైద్యుల ద్వారా పొంది అధికారులకు అందజేయాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోని బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు నిలిపివేయనున్నట్లు డీఈవో పురుషోత్తం ఆదివారం తెలిపారు.
16న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోని వారి జీతాలు నిలుపుదల చేయాలని డ్రాయింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వారిని పాఠశాలల్లోకి అనుమతించేది లేదన్నారు. వ్యాక్సిన్ చేయించుకుని ధ్రువీకరణ పత్రాలను డ్రాయింగ్ అధికారులకు అందించాలని సూచించారు.
ప్రైవేటు పాఠశాలల్లో టీకాలు వేసుకోకపోతే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.
0 Komentar