Credit and Debit Card Locks: What They
Are and How They Work
మీ క్రెడిట్, డెబిట్
కార్డుల లావాదేవీలపై పరిమితిని మీరే సెట్ చేసుకోవచ్చు – వివరాలు
ఇవే
డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డుల ఉపయోగంతో పరిమితికి మించి ఖర్చు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ ఖర్చులను అదుపులో పెట్టుకోవడానికి మీ క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలపై పరిమితిని మీరే సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు కార్డు ఉపయోగించిన ప్రతిసారీ రూ.5 వేలు లేదా రూ.10 వేలు మించి లావాదేవీలు చేయకూడదు అనుకుంటే, దానికి తగినట్లగా పరిమితిని ఏర్పాటు చేసుకోవచ్చు. అంతకు మించి చేసే లావాదేవీలు విఫలమవుతాయి. అంతర్జాతీయ లావాదేవీలను నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది.
ఎలా సెట్ చేయాలి?
కార్డు పరిమితిని ఏర్పరుచుకునే విధానం బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కార్డుపై ఉన్న బటన్‌ను స్విచ్ ఆన్ చేయడం ద్వారా అనుమతిస్తే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా పరిమితిని ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మీరు కార్డు ఆప్షన్‌కు వెళ్లి పరిమితి విధించాలనుకుంటున్న కార్డు వివరాలను నమోదు చేయాలి. దేశీయ లావాదేవీల కోసం లేదా అంతర్జాతీయ లావాదేవీల కోసం పరిమితి ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? లేదా ఇతర మార్పులు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అన్న ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా లిమిట్‌ను సెట్ చేసుకునే సౌకర్యాన్ని కొన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఒకసారి ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత బ్యాంకు పరిమితి విధించిన సంగతి మీకు తెలియజేస్తుంది. తదుపరి లావాదేవీలు పరిమితికి మించితే బ్యాంకు మీకు సమాచారం ఇస్తుంది.
పరిమితి ఎందుకు పెట్టుకోవాలి?
డెబిట్, క్రెడిట్
కార్డుల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు
బ్యాంకులతో పాటు మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి మీ పాస్‌వర్డ్,
పిన్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకండి. మీ కార్డు విత్‌డ్రా
లిమిట్‌ను పరిమితం చేయండి. ఉదాహరణకు మీ కార్డు అంతర్జాతీయ లావాదేవీలను రద్దు
చేసి, దేశీయంగా ఒకసారి చేసే లావాదేవీలను రూ.5 వేలకు పరిమితం చేశారనుకుందాం. అంతర్జాతీయంగా మోసాలకు పాల్పడే వారు
మీ కార్డు వివరాల ద్వారా లావాదేవీలు నిర్వహించలేరు. అలాగే దేశీయంగా మోసాలకు
పాల్పడితే రూ.5 వేలకు మించి నష్టపోకుండా జాగ్రత్తపడొచ్చు.
0 Komentar